Khanapur MLA : త్వరలో నాగోబా ఆలయ మురాడి ప్రారంభిస్తాం

by Aamani |
Khanapur MLA : త్వరలో నాగోబా ఆలయ మురాడి ప్రారంభిస్తాం
X

దిశ, ఉట్నూర్ : ఆదివాసీల ఆరాధ్యదైవం కేస్లాపూర్ గ్రామంలో కొలువుదీరిన నాగోబా ఆలయ మురాడి త్వరలో ప్రారంభిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న నాగోబా ఆలయ మురాడిని పరిశీలించారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుని హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నాగోబా ఆలయ మురాడి నిర్మాణానికి సొంత నిధులను ఖర్చు చేస్తున్నారని, దాదాపు అన్ని పనులు పూర్తి అయ్యాయని, త్వరలో సాంప్రదాయ బద్దంగా మురాడిని ప్రారంభిస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నాగోబా ఆలయ అభివృద్ధికి రూపాయి కోటి నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేద వాడికి అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆయన వెంట మెస్రం వంశీయులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story