- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తేనే పట్టభద్రులకు న్యాయం

దిశ ప్రతినిధి, నిర్మల్ : వచ్చే శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ నియోజకవర్గం అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపిస్తేనే పట్టభద్రులకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో అభ్యర్థి నరేందర్ రెడ్డితో కలిసి ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ,అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయాన్ని పట్టభద్రులు మర్చిపోవద్దని గుర్తు చేశారు.
తనకు అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి అన్ని సమస్యలు తీసుకువెళ్లే అవకాశం కలుగుతుందన్నారు. తాను గెలిస్తే నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో లైబ్రరీలు బలోపేతం చేస్తామన్నారు. అలాగే విద్యార్థులకు క్రీడా ప్రాంగణాలు మెరుగు చేసి వారికి అండగా నిలుస్తామని చెప్పారు. పోటీ పరీక్షలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, స్టడీ సర్కిళ్ల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇతరులకు అవకాశం ఇస్తే వారితో ఒరిగేదేమీ లేదని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. సమావేశంలో స్థానిక కాంగ్రెస్ నేతలతో సహా జిల్లాకు చెందిన పట్టభద్రులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.