ఆశ్రమ పాఠశాల విద్యార్థికి జపాన్ దేశ ఆహ్వానం

by Disha Web Desk 15 |
ఆశ్రమ పాఠశాల విద్యార్థికి జపాన్ దేశ ఆహ్వానం
X

దిశ,కాసిపేట : మండలంలోని మల్కేపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థికి జపాన్ దేశ ఆహ్వానం దక్కింది. ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల మల్కేపల్లి నుండి గతంలో ఫీడింగ్ ఛాంబర్ ప్రాజెక్ట్ ను భౌతిక, రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు వేములవాడ రమేశ్ తన విద్యార్థి జుముడి అంజన్న తో కలిసి రూపొందించి , ఆ ప్రాజెక్ట్ ద్వారా జాతీయ స్థాయిలో ఇన్​స్పేర్ మనాక్ అవార్డ్స్ లో 4వ స్థానం పొందారు. అలా తనకంటూ ఒక ప్రత్యేకతను పొందిన పాఠశాల ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల మల్కేపల్లి. మళ్లీ అదే సైన్స్ ప్రాజెక్ట్ కు అరుదైన గౌరవం లభించింది. గవర్నమెంట్ ఆఫ్ జపాన్ వారి నుండి సకుర సైన్స్ హై స్కూల్ ప్రోగ్రాం ఆఫ్ జపాన్ ద్వారా వారి దేశంను సందర్శించే అవకాశం కల్పించింది. జపాన్ దేశంను సందర్శించి అక్కడి నూతన సాంకేతికతను దగ్గరి నుంచి తెలుసుకునే అవకాశం కల్పించింది.

ఇంతటి గొప్ప అవకాశం లభించడం పట్ల గ్రామస్తులు, ఉపాద్యాయులు, ప్రధానోపాధ్యాయుడు విద్యార్థి జుమిడి అంజన్నను, గైడ్ టీచర్ వేములవాడ రమేశ్ ని, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు ని ప్రత్యేకంగా అభినందించారు. ఇది మంచిర్యాల జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం గా కొనియాడారు. ఒక ఆశ్రమ పాఠశాల విద్యార్థిని జపాన్ దేశ ప్రభుత్వం వారు అహ్వానిచడం పట్ల గిరిజన సంక్షేమశాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అజ్మీరా నరసింహ మాట్లాడుతూ తొలిసారి ఈ అరుదైన గౌరవం మల్లేపల్లి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలకి లభించినందుకు సంతోషంగా ఉందని తెలియజేశారు.



Next Story

Most Viewed