లోక్ అదాలత్ కు భారీ స్పందన

by Sridhar Babu |
లోక్ అదాలత్ కు భారీ స్పందన
X

దిశ, ఆదిలాబాద్ : జిల్లా కోర్టు శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్​ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చిందని ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఆయన మాట్లాడుతూ రాజీమార్గమే రాజమార్గం అని ప్రజలు రాజీపడ్డారని తెలిపారు. జిల్లాలో మొత్తం 1732 కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. మరో 39 సైబర్ క్రైమ్ కేసులలో బాధితులు పోగొట్టుకున్న 8,46,764 డబ్బును తిరిగి వారికి అందించడానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావుకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కోర్టు డ్యూటీ పోలీస్ సిబ్బందితో పాటు ఆయా పోలీసు ఉన్నతాధికారులను ఆయన అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed