పాత పద్ధతిలోనే ప్రమోషన్లు క‌ల్పించండి

by Disha Web Desk 22 |
పాత పద్ధతిలోనే ప్రమోషన్లు క‌ల్పించండి
X

దిశ‌, మంచిర్యాల: అంగ‌న్‌వాడీ హెల్ప‌ర్ల‌కు పాత పద్ధతి ద్వారానే ప్ర‌మోష‌న్లు క‌ల్పించాల‌ని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వ‌హించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయ‌న మాట్లాడుతూ…. చాలా రాష్ట్రాల్లో ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలకు పెంచారన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చ‌రించారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు భానుమతి మాట్లాడుతూ…. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ హెల్పర్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాల‌న్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.ప్రకాష్, విరోనిక, రాజేశ్వరి అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు, హెల్పర్లు స్వరూప, స్వాతి, లావణ్య, స్వరూప మధులత, అనూష, పద్మ, స్రవంతి, కౌసల్య, మీనాక్షి, శారద తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed