వైభవోపేతంగా గాంధారి మైసమ్మ జాతర..

by Disha Web Desk 20 |
వైభవోపేతంగా గాంధారి మైసమ్మ జాతర..
X

దిశ, రామకృష్ణాపూర్ : మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారులో గల గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర ఆదివారం వైభవపేతంగా జరిగింది. ఆదివాసీ, నాయకోపోడ్ కుటుంబ సభ్యులు ఖిల్లాలోని దర్వాజ వద్ద గాంధారి మైసమ్మతో పాటు కాలభైరవుడు, నాగదేవత, దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. జడ్పీటీసీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఐటీడీఏ ఏపీవో రాంబాబు, ఆర్డీవో లు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన దర్బార్ లో నాయకపోడు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ బొక్కలగుట్ట జాతీయ రహదారి నుండి గాంధారి ఖిల్లా ములమలుపు వరకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ 2.10 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా రహదారి నిర్మించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతిఏటా గాంధారి ఖిల్లా జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ నుండే కాక మహారాష్ట్ర, చతిస్గడ్ ప్రాంతాలనుండి పెద్ద ఎత్తున ఆదివాసి భక్తులు తరలిరావడంతో గాంధారిఖిల్లాపై సందడి నెలకొంటుందని అన్నారు. ఆదివాసీలు సంస్కృతి, సంప్రదాయాలతో చేసిన సాంస్కృతిక నృత్యాలు భక్తులను అలరించాయి. మూడు రోజుల పాటు జరిగే ఆదివాసీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయం కార్యక్రమ జాతరకు విద్యుత్, త్రాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని భక్తులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వేల్పుల రవి, ఎంపీపీ మంగ, వైస్ ఎంపీపీ రాజ్ కుమార్, రామకృష్ణాపూర్ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కౌన్సిలర్ లు జాడ శ్రీనివాస్, బోయనపల్లి అనిల్ రావు, గడ్డం రాజు, పారుపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed