నిండు ప్రాణాలను బలిగొన్న సరదా

by Disha Web Desk 1 |
నిండు ప్రాణాలను బలిగొన్న సరదా
X

దిశ, బెజ్జుర్: వేసవి సెలవుల్లో సరదాగా ఆ అన్నదమ్ములు మోటార్ సైకిల్ నేర్చుకుందాన్న ఆశలు ఆడియాసలయ్యాయి. విద్యుత్ స్తంభానికి బైక్ ఢీకొట్టిన ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బెజ్జుర్ మండలం కుకుడా గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుకూడా గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన నితీష్ (16), అతని సోదరుడు నిశ్వంత్ మోటార్ సైకిల్ నేర్చుకునేందుకు కుకుడా నుంచి బారెగూడెం వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ కొర్తేగూడెం వద్దకు రాగానే బైక్ అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్న బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పెద్దల నితీష్ అక్కడికక్కడ మృతి చెందగా అతని సోదరుడు నిశ్వంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. కాగా, పెద్దల నితీష్ బెజ్జూర్ మండలం సలుగుపల్లి ఆశ్రమ పాఠశాలలో ఈ మధ్యే పదో తరగతి పరీక్షలు రాశాడు. అతని సోదరుడు నిశ్వంత్ ఉట్నూరు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగింది.

Next Story

Most Viewed