బీజేపీలో చేరిన మాజీ ఎంపీ గోడం నగేష్…

by Disha Web Desk 22 |
బీజేపీలో చేరిన మాజీ ఎంపీ గోడం నగేష్…
X

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మాజీ ఎంపీ గోడం నగేష్ బీజేపీ పార్టీలో చేరారు. ఈ మేరకు దేశ ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని ప్రధానమంత్రి సచివాలయానికి చేరుకున్న ఆయన నరేంద్ర మోదీని కలిశారు. అనంతరం ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో పాటు లక్ష్మణ్ ఇతర ఇతర నాయకులకు పుష్పగుచ్చం అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాజీ ఎంపీ అయినా గోడం నగేష్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. మాజీ ఎంపీ నగేష్ చేరికతో పార్టీ నాయకుల్లో కొత్త ఆలోచన. ప్రస్తుత ఎంపీ సోయం బాపూరావు మార్చాలని ప్రయత్నిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలకు నగేష్ చేరికతో టెన్షన్ పట్టుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎంపీ నగేష్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎంపీ టికెట్ తనకు కేటాయించాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో చేరిన నగేష్ గత పదిహేనేళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో మాజీ ఎంపీగా కొనసాగుతున్నారు. గడిచిన గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన నగేష్ ప్రస్తుత పార్లమెంట్ సోయం బాపురావును కలిసి జిల్లా రాజకీయాలను గతంలోనే చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల పట్ల నగేష్ డాక్టర్ లక్ష్మణ్ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అధిష్టానంలోని ముఖ్య నాయకులను కలిసి పుష్పగుచ్చం అందించి తనకు ఆదిలాబాద్ పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నట్లు నగేష్ వెల్లడించారు. ఆదివారం అధిష్టానం టికెట్ల కేటాయింపులో సమావేశం నిర్వహించనుండగా ఇది కొంత మేరకు సోమవారం వరకు పోస్ట్ పోన్ అయినట్లు తెలిసింది. దీంతో ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి నియామకంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి 42 మంది అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నట్లు దరఖాస్తు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

Next Story

Most Viewed