మాజీ మంత్రి వినోద్ దారెటు ?

by Disha Web Desk 15 |
మాజీ మంత్రి వినోద్ దారెటు ?
X

దిశ, చెన్నూర్ : మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి తనయుడు గడ్డం వినోద్ చెన్నూరు నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు ఆయన అనుచర వర్గం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఎమ్మెల్యే ఎన్నికలలో బెల్లంపల్లి నియోజకవర్గం నుండి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బెల్లంపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్న వారిలో మొదటి లైన్ లో ఉన్నారు. కానీ గత రెండు మూడు రోజుల నుండి కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం స్థానిక నాయకునికి ఎమ్మెల్యే టికెట్ కట్ట పెట్టాలని ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికి టికెట్టు ఇస్తే తమ మద్దతు ఇవ్వబోమని విలేకరుల సమావేశంలో నిర్మోహమాటంగా తమ అభిప్రాయాన్ని తెలిపారు.

ఎన్నడు లేని విధంగా ఒకేసారిగా తమ సొంత పార్టీలోని నాయకులు లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ తేవడంతో అసహనంతో ఉన్న వినోద్ తనకు మొట్టమొదటిసారిగా రాజకీయంగా అవకాశం కల్పించిన చెన్నూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ లభిస్తే పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు ఆయన అభిమానులు గుసగుసలాడుతున్నారు. చెన్నూరు నియోజకవర్గం నుండి 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో మంత్రి పదవిని పొంది నియోజకవర్గంలోని ఎన్నో అభివృద్ధి పనులు చేసి నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందారు.

ప్రస్తుతానికి నియోజకవర్గంలో కూడా ఆయనకు ఒక బలమైన వర్గం పని చేస్తుంది. ఒకవేళ బెల్లంపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ రాకపోతే తిరిగి చెన్నూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు ఆయన అనుచర వర్గం, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రాబోయే ఎన్నికలలో ఏ పార్టీ నుండి ఎవరికీ టికెట్ లభిస్తుందో అంతా ఆగమ్య గోచరంగా ఉందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.



Next Story

Most Viewed