ఎట్టకేలకు బెల్లంపల్లిలో కోనో కార్పస్ మొక్కల తొలగింపు

by Aamani |
ఎట్టకేలకు బెల్లంపల్లిలో  కోనో కార్పస్ మొక్కల తొలగింపు
X

దిశ,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఎట్టకేలకు కోనో కార్పస్ మొక్కల తొలగింపుకు ముహూర్తం వచ్చింది. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాసరావు మొక్కల తొలి గింపుకు శ్రీకారం చుట్టారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ముందు చూపులేని పాలకులు ప్రాణాంతకమైన కోనో కార్పస్ మొక్కలను డివైడ్లపై నాటారు. పట్టణంలోని ప్రధాన బజార్ ఏరియా, రైల్వే స్టేషన్ ప్రధాన రహదారి డివైడెడ్ లపై కోనో కార్పస్ మొక్కలను నాటారు. అయితే ఈ మొక్కల వల్ల శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య హెచ్చరించారు. అంతేకాకుండా ఈ మొక్కల వల్ల భూగర్భ జలాలలు అంతరించిపోయి మానవాళి మనుగడకు పెను ముప్పుగా పరిణమించే కోనో కార్పస్ మొక్కల వల్ల జరిగే ప్రమాదాన్ని అధికారులు ఆలస్యంగానైనా గుర్తించారు.

ఈ మొక్కలను తొలగించాలని ప్రజలు, పలు ప్రజా సంఘాల నాయకులు ఇప్పటికే పలుమార్లు ఆందోళన చేసిన విషయం తెలిసింది. అధికారులకు లిఖితపూర్వకంగా దరఖాస్తులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆలస్యంగా అయినా ప్రజా ఒత్తిడిని పరిగణములకు తీసుకొని విషతుల్యమైన కోనో కార్పస్ మొక్కల ముప్పు నుంచి పట్టణ ప్రజలను కాపాడేందుకు అధికారులు పోనుకోవడం పట్ల హర్షం వ్యక్తం అవుతున్నది. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మొక్కల తొలగింపు ప్రక్రియను దగ్గరుండి చేపట్టారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ముందుచూపుతోటి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపని ఆరోగ్యదాయకమైన మొక్కలను నాటాలని ప్రజలు కోరుతున్నారు. కోనో కార్పస్ మొక్కల తొలగింపు ను చేపట్టిన అధికారులు వాటి స్థానంలో పర్యావరణానికి మేలు చేసే ఆరోగ్యాన్ని అందించే మొక్కలను పెంచాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed