విద్యుత్ కోతలకు నిరసనగా రైతన్నల రాస్తారోకో..!

by Disha Web Desk 20 |
విద్యుత్ కోతలకు నిరసనగా రైతన్నల రాస్తారోకో..!
X

దిశ, బైంసా : కరెంటు కోతలకు నిరసనగా బీజేపీ బాల్కొండ పాలక్ ఇంచార్జి, ముధోల్ తాలూకా నాయకులు రామారావు పటేల్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నానిర్వహించి, రాస్తారోకో చేపట్టారు. బీజేపీ నాయకులతో, తాలూకా వ్యాప్త రైతులు బైంసా విద్యుత్ సబ్స్టేషన్ ముందర ధర్నా నిర్వహించి, జాతీయ రహదారి పై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రామారావు పటేల్, నాయకులు, పలువురు రైతులు మాట్లాడుతూ 24 గంటల విద్యుత్ అందిస్తానని మాయమాటలు చెప్పి ఇప్పుడు పంటలు పండడానికి కనీస అవసరమైన నీటి సౌకర్యాన్ని కూడా అందించకపోవడం రైతులకు చాలా బాధాకరమని, విధిస్తున్న కరెంటు కోతలతో పంటలు నేలపాలు అవుతున్నాయని అన్నారు.

రానున్న రోజుల్లో బీజేపీ సర్కారు రైతుల పక్షాన నిలిచి అన్ని విధాల మేలు చేస్తుందని అన్నారు. దీంతో ప్రధాన జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రాస్తారోకోని విరమించే ప్రయత్నం చేయగా విద్యుత్ అధికారులు రావాలంటూ బైఠాయించారు. సంబంధిత అధికారులు రావడంతో వినతిపత్రం అందించి, కరెంటు కోతలు ఉండకుండా చూడాలని తెలిపారు. అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎక్స్ బైంసా మున్సిపల్ వైస్ చైర్మన్ గంగాధర్, తూమోల్ల దత్తాత్రి (తూమోల్ల ముత్తన్న సేవాసమితి అధ్యక్షులు), జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్, రవి పాండే, గోపాల్ సార్డ, నగర్ నారాయణ్ రెడ్డి, ఆప్కగజ్ఙరాం, నాగేష్, రాజన్న, గజేందర్, జిల్లా కార్యదర్శి భుమేష్, మహగాం సర్పంచ్ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed