రైతులు సోయాబీన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి : ఖానాపూర్ ఎమ్మెల్యే

by Aamani |
రైతులు సోయాబీన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి : ఖానాపూర్ ఎమ్మెల్యే
X

దిశ, ఉట్నూర్ : రైతులు దళారులను నమ్మకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దే తమ పంటను అమ్ముకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఇంద్రవెల్లి మండలంలోని మార్కెట్ యార్డులో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతుల గురించి ఆలోచించి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పేర్కొన్నారు. సోయాబీన్ కనీసం మద్దతు ధర రూ.4892 రూపాయలు ఉందని, రైతుల తమ పంటలను ప్రభుత్వానికే అమ్మాలని సూచించారు. మధ్యవర్తులను దళారులను నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ డోంగ్రే మారుతి, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed