కరెంటు కోసం రోడ్డెక్కిన రైతులు..

by Disha Web Desk 20 |
కరెంటు కోసం రోడ్డెక్కిన రైతులు..
X

దిశ, కుబీర్ : కుబీర్ మండల కేంద్రంలో గురువారం రైతులు వ్యవసాయానికి కోతలు లేని కరెంటు ఇవ్వాలని రోడ్డెక్కారు. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటలపాటు కరెంటు ఇవ్వాలని కోరుతూ వివేకానంద చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. రైతుల ధర్నాకు భాజపానాయకులు మద్దతు పలికారు. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో చెప్పలేని అధికారులు పై మండిపడ్డారు. రైతు సంక్షేమమంటూ గొప్పలు చెప్పుకునే ప్రజాప్రతినిధులకు, ప్రస్తుతం వ్యవసాయానికి కరెంటు ఎలా ఇస్తున్నారో తెలియడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరెంటు సరఫరా టైమ్ ను సంబంధిత శాఖ అధికారులు స్పష్టంగా చెప్పాలని, మెసేజ్ వచ్చినప్పుడు కరెంట్ సరఫరా అని చెప్పడం ఏంటని ఆరోపించారు. రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా చేయడంతో అటవీ ప్రాంతాల చేల్లో వారికి పాములు, అడవి పందులు, గుడ్డేనుగుల, ఇతర జంతువుల, బెడద ఉందని రైతులంటున్నారు. 24 గంటల కరెంటు అనే ఆశతో సాగు విస్తీర్ణం పెంచుకోన్నామని, అవసరమున్న సమయంలోనే నీళ్లు పెట్టలేకపోతున్నామని దిగుబడులపై ప్రభావం పడుతుందన్నారు. వ్యవసాయానికి నిరంతర కరెంటు ఇవ్వాలని కోరుతూ, రైతులు భాజపా నాయకులు కలిసి విద్యుత్ శాఖవినతి పత్రాన్ని అందజేశారు.


Next Story

Most Viewed