ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతల ఆందోళన

by Disha Web Desk 15 |
ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతల ఆందోళన
X

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని ఎల్లకపేట పరిధిలోని ఐకేపీ సెంటర్ల వద్ద గత 20 రోజుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతన్నలు 63వ జాతీయ రహదారిపై వడ్ల బస్తాలతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతన్నలు మాట్లాడుతూ గత 20 రోజుల నుండి ఐకేపీ కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయడం లేదని, తాము రాత్రి పగలు అని తేడా లేకుండా సెంటర్ల వద్ద ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే అధికారులు శ్రద్ధ వహించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడం లేదని , కోత పేరిట 10 కిలోల ధాన్యం కటింగ్ చేస్తున్నారని రైతులు వాపోయారు. అకాల వర్షాలు మొదలైతే తాము నష్టపోతామని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోవడంలేదని వారు పేర్కొన్నారు. తరుగు పేరుతో రైతులను నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక నాయకులు, అధికారులు చొరవ తీసుకొని ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలని, కొలుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed