ఆదిలాబాద్ లో 1 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

by Kalyani |
ఆదిలాబాద్ లో 1 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
X

దిశ, ఆదిలాబాద్ : ముందుగా వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని మావల పోలీస్ స్టేషన్ పరిధిలో గల రామ్ నగర్ ఏరియాలో 19 లక్షల విలువగల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం తమకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు నకిలీ విత్తనాల తయారీ నిర్వహిస్తున్నారని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేయగా దాదాపు 400 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు, వాటి విలువ దాదాపు 19 లక్షల రూపాయలు ఉంటాయని తెలియజేశారు. వ్యవసాయ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నకిలీ పత్తి విత్తనాల వ్యవహారం ప్రధానంగా ముగ్గురు నిర్వహిస్తున్నారని, వారిలో

సామా అశోక్ రెడ్డి,ఎ రాజేందర్, కాపార్తి మణికంఠ ( పరారీ)లో ఉన్నట్లు తెలిపారు. వీరి ముగ్గురు కలిసి వ్యాపారాలు నిర్వహిస్తుంటారని, వీరు ఆదిలాబాద్ పట్టణంలో మీనాక్షి గోల్డ్,పాండురంగ, పుడమి J16, వైట్ గోల్డ్ అనే కంపెనీల కు సంబంధించిన నకిలీ విత్తనాలను తయారు చేస్తుంటారని తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతుందని వీరందరితో సంబంధం ఉన్న వారిపై కూడా కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ లో వీరిపై కేసు నమోదు చేయబడిందని తెలిపారు.

Next Story