న‌కిలీ ప‌త్తి విత్త‌నాలు స్వాధీనం

by Kalyani |
న‌కిలీ ప‌త్తి విత్త‌నాలు స్వాధీనం
X

దిశ‌, బెజ్జూరు, తాండూరు : మంచిర్యాల‌, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులు న‌కిలీ ప‌త్తి విత్త‌నాలు స్వాధీనం చేసుకున్నారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆధ్వ‌ర్యంలో 70 కిలోల నకిలీ పత్తి విత్తనాలు ప‌ట్టుకోగా, మంచిర్యాల జిల్లా తాండూరులో 30 కిలోల విత్త‌నాలు స్వాదీనం చేసుకున్నారు.

బెజ్జూర్లో తొర్రం ప్రశాంత్ అనే వ్యక్తి నకిలీ బీటీ 3 పత్తి విత్తనాలు అమ్ముతున్నాడ‌న్న స‌మాచారం మేర‌కు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అత‌న్ని ప‌ట్టుకుని విచారించ‌గా, సోమినిలోని ఆయ‌న ఇంటిలో తనిఖీ చేయ‌గా, రెండు సంచులలో 70 కిలోల నకిలీ పత్తి విత్తనాలు దొరికిన‌ట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు. వాటి విలువ దాదాపుగా రూ. 1.50 ల‌క్ష‌లు ఉంటుంద‌న్నారు. ఈ దాడుల్లో సీఐతో పాటు ఎస్ఐ వెంకటేష్, కానిస్టేబుల్ వీ. మధు, పీ. రమేష్, వెంకటేష్ పాల్గొన్నారు.

30 కిలోల పత్తి విత్తనాలు పట్టుకున్న పోలీసులు

తాండూరు మండ‌లం కొత్తపల్లిలో ఎర్రవోతు రాజు అనే వ్య‌క్తి ప‌త్తి విత్త‌నాలు విక్ర‌యిస్తున్నాడ‌నే స‌మాచారం మేర‌కు తనిఖీ చేయగా 30 కిలోల నకిలీ విడి పత్తి విత్తనాలు దొరికాయి. ఈ నకిలీ పత్తి విత్తనాలను ప్ర‌కాశం జిల్లాకు చెందిన తిరుమల శెట్టి రామకృష్ణ అనే వ్య‌క్తి ద‌గ్గ‌ర కొన్న‌ట్లు రాజు వెల్ల‌డించాడు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story