రైతు సంఘాల ఆధ్వర్యంలో పత్తిరైతుల ధర్నా..

by Disha Web Desk 20 |
రైతు సంఘాల ఆధ్వర్యంలో పత్తిరైతుల ధర్నా..
X

దిశ, ఇచ్చోడ : ఆరుగాలం కష్టించి పత్తి, ఇతర పంటలను పండించే రైతన్నలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగడునా మోసం చేస్తున్నాయని ఏఐసీసీ సభ్యులు డాక్టర్ నరేష్ జాధవ్ అన్నారు. పత్తి పంట క్వింటాలుకు రూ. 15 వేలు గిట్టుబాటు ధర ప్రకటించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మండల కేంద్రం ఇచ్చోడలో సోమవారం రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వ హించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మూడునెలల క్రితం రూ. 9300 చొప్పున కొనుగోలు చేసి, ప్రస్తుతం రూ.2 వేలు తగ్గించి కొనుగులు చేయడం ఎంత వరకు సబబు అని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ప్రతి ఏటేటా ఎరువులు, విత్తనాలు, క్రిమికీటక మందుల ధరలను పెంచుతుందని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఎందుకు ప్రకటించడం లేదన్నారు.

అతివృష్టి, అనా వృష్టి మూలంగా గత నాలుగేళ్లుగా పంటల దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయని, చేసిన అప్పులు తీర్చలేక అన్నదాతలు ఆత్మహత్య లు చేసుకుంటున్నారని అన్నారు. రైతన్నల ఆత్మహత్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ఆయన ఆరోపించారు. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులు తగిన రీతిలో బుద్ధి చెప్పనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బోథ్ బ్లాక్ అధ్యక్షులు మైమూద్ ఖాన్, మండల అధ్యక్షులు కళ్లెం నారాయణ రెడ్డి, బజార్ హత్నూర్ జడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య, నాయకులు ఆడే గజేందర్, భీమన్న, లతీఫ్, ముస్తాఫా, రషీద్, లక్ష్మణ్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.


Next Story