సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ అభివృద్ధి : ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

by Disha Web Desk 15 |
సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ అభివృద్ధి : ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
X

దిశ, కాగజ్ నగర్ : సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల సందర్భంగా కాగజ్ నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద నాయకులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేశారు. కాపువాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, మున్సిపల్, తహసీల్దార్, మండల పరిషత్, పోలీస్ స్టేషన్, పలు ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో, అధికారులు, నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిర్పూర్ నియోజకవర్గంలోని మండలాల్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, వైస్ చైర్మన్ గిరీష్, పట్టణ అధ్యక్షుడు, నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed