- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
అక్రమ నిర్మాణలు కూల్చివేత..

దిశ, రామకృష్ణాపూర్: దిశ దినపత్రికలో 'దర్జాగా కబ్జాలు' అనే కథనం ప్రచురితం కావడంతో సింగరేణి సెక్యూరిటీ అధికారులు స్పందించారు. సింగరేణి అధికారులు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తుండగా కబ్జాదారులు తమ చరవాణిని సింగరేణి సిబ్బందికి ఇచ్చి ఫోన్ కాల్ లో ఎమ్మెల్యే పీఏ మీతో మాట్లాడుతాడు అని సిబ్బందితో పీఏ చర్చించారు. సింగరేణి స్థలానికి మున్సిపాలిటీ లో రికార్డు ప్రకారం పన్నులు కడుతున్నానని అనడంతో సింగరేణి ఎస్ అండ్ పీసీ సిబ్బంది అవక్కయ్యారు. సింగరేణి స్థలానికి మున్సిపాలిటీ వారు పనులు ఎలా తీసుకుంటారని కబ్జాదారులను ప్రశ్నించగా అదంతే అలా జరుగుతుంది, కావాలంటే మీకు రికార్డులు చూపెట్టమంటారా అంటూ సమాధానం ఇచ్చాడు. అక్రమ నిర్మాణదారు సిబ్బందితో మాట్లాడుతూ ఇప్పుడు ఈ నిర్మాణాన్ని కూల్చివేసిన మరో రెండు రోజుల్లో మళ్లీ నిర్మిస్తానని అనడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.