DCP Bhaskar : వినాయక నిమజ్జనాన్ని శాంతి సామరస్యంతో జరుపుకోవాలి

by Aamani |
DCP Bhaskar : వినాయక నిమజ్జనాన్ని శాంతి సామరస్యంతో జరుపుకోవాలి
X

దిశ,చెన్నూర్ : వినాయక నిమజ్జనాన్ని శాంతి సామరస్యాలతో జరుపుకోవాలని డీసీపీ భాస్కర్ అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం లో గణేష్ నవరాత్రుల అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించే పెద్ద చెరువు నిమజ్జనం ఘాట్ ను విద్యుత్, రెవెన్యూ మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని వీధులలో ఎటువంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, గుంతల రోడ్లను పూడ్చి వినాయకులను తరలించే వాహనాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని, వర్షాలు కురుస్తున్న కారణంగా విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పెద్ద చెరువు ప్రాంతంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆయన వివిధ శాఖల అధికారులకు తగు సూచనలు సలహాలు అందజేశారు. గణేష్ మండపాల నిర్వహకులు సమయపాలన పాటించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story