- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైస్ మిల్లర్ల దందా.. సర్కారు ఖజానాకు భారీ చిల్లు
దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్లు సర్కారు ఖజానాకు భారీ చిల్లు పొడిచారు. అప్పటి ప్రభుత్వ పాలన తో పాటు అధికార యంత్రాంగం అండతో చెలరేగిపోయారు. ప్రభుత్వం నుంచి తీసుకునే సీఎంఆర్ బియ్యం తిరిగి సర్కారుకు అప్పగించే విషయంలో అధికార యంత్రాంగం ఉదాసీనత వల్ల కోట్లాది రూపాయలు దండుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా సుమారు 200 కోట్ల రూపాయల దోపిడీ జరిగినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఈ మొత్తం మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన రైస్ మిల్లర్లు బియ్యం అమ్ముకుని సర్కారుకు బకాయి పడినట్లు విమర్శలు ఉన్నాయి.
భారీగా దోపిడీ...
నిర్మల్ జిల్లాలో రూ. 107 కోట్ల విలువ గల ధాన్యం మాయం అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లాలో ఏడు రైస్ మిల్లులపై క్రిమినల్ కేసుల తో పాటు ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అధికారులు తెలిపిన సమాచారం మేరకు... భైంసా మండలం దేగాం గ్రామంలో ఉన్న రైస్ మిల్ 5,905 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైసు ఇవ్వాల్సి ఉండగా..ఇప్పటివరకు ఇచ్చింది 692 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ రైస్ మాత్రమే. ఈ రైస్ మిల్ పై.. క్రిమినల్ కేసుతోపాటు ఆర్ఆర్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో ఉన్న... సాయి కృప రా రైస్ మిల్....2022-23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 2,845 మెట్టనుల సీఎంఆర్ రైస్ ఇవ్వాలి. ఇప్పటివరకు ఇచ్చింది 912 మెట్టనుల సీఎంఆర్ రైస్ మాత్రమే... ఈ రైస్ మిల్ పై కూడా క్రిమినల్ కేసుతోపాటు ఆర్ఆర్ యాక్టీవ్ కింద కేసులు నమోదు చేశారు.
సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో ఉన్న సాయి కృప రా రైస్ మిల్ 2022-23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 2,845 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ ఇవ్వాల్సి ఉండగా, 912 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ మాత్రమే ఇవ్వడంతో ఈ రైస్ మిల్ పై కూడా క్రిమినల్ కేసుతో పాటు ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. బాసర మండలంలోని... అక్షర రైస్ మిల్ 2022-23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 1305 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ రైస్ ఇవ్వాలి. అలాగే రబీ సీజన్ కు సంబంధించి 5083 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ రైస్ ఇవ్వాలి. ఇప్పటివరకు కేవలం 28 ఎం.టి ల సిఎంఆర్ రైసు మాత్రమే ఇవ్వడం గమనార్హం. ఇక లోకేశ్వరం మండలం జోహార్ పూర్ గ్రామంలో ఉన్న రాజరాజేశ్వర రా రైస్ మిల్ 2022-23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 1672 ఎం.టి ల సీఎంఆర్ రైస్ ఇవ్వాల్సి ఉండగా...ఇప్పటివరకు ఇచ్చింది 858 టన్నుల సీఎంఆర్ రైస్ మాత్రమే. ఇదే మండలం దర్మోరా గ్రామానికి చెందిన వెంకటేశ్వర రా రైస్ మిల్ 2022-23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 1239 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ కు గానూ ఇప్పటివరకు ఇచ్చింది 314 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ రైస్ మాత్రమే. ముధోల్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన జై శ్రీత ఇండస్ట్రీస్ రా రైస్ మిల్ 2022-23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 2812 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైసు ఇవ్వాలి. అలాగే రబీ సీజన్ కు సంబంధించి 448 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ రైస్ ఇవ్వాలి. ఇప్పటివరకు 1258 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ ఇవ్వడం జరిగింది.
సారంగాపూర్ మండలం చించోలి బి గ్రామానికి చెందిన అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ రా రైస్ మిల్ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 625 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్, అలాగే రబీ సీజన్ కు సంబంధించి 263 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ ఇవ్వాలి. ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 57 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ మాత్రమే ఇచ్చింది. కాగా ఈ రైస్ మిల్లుల పై క్రిమినల్ కేసులతో పాటు ఆర్ ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. కాగా ఇలాంటి డిఫాల్ట్ రైస్ మిల్లులపై కేసులు నమోదు చేశామని కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మేనేజర్ గోపాల్ వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ఆ మిల్లులను బ్లాక్ లిస్ట్ లో పెట్టి తీరుతామన్నారు.
మంచిర్యాల జిల్లాలోనూ...
మంచిర్యాల జిల్లాలో మొత్తం 52 రైస్ మిల్లులు ఉన్నాయి. వీటిలో ఇటీవల సివిల్ సప్లై అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అధికారుల తనిఖీల్లో 39 మంది రైస్ మిల్లర్లు సిఎంఆర్ ధాన్యం ప్రభుత్వానికి అప్పగించకుండా దొడ్డిదారిన ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్ముకున్నట్లు తేలింది. ఇలాంటి రైస్ మిల్లులను అధికారులు డిఫాల్ట్ లిస్ట్ లో చేర్చారు. జిల్లాలోని 9 మిల్లులో రూ. 82.41 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. బకాయిలు ఎక్కువగా ఉన్న 8 మిల్లులపై ఆర్ ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయగా, వాటిలో రెండు మిల్లులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. బెల్లంపల్లికి చెందిన రమేష్ అనే మిల్లు యజమానిని ఏకంగా రూ. 17 కోట్లు బకాయిలు ఉండటంతో అతన్ని జైలుకు పంపారు. మిగతా మిల్లుల్లోనూ అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు.
మళ్లీ అధికారులపై ఒత్తిడి...
డిఫాల్ట్ కింద కేసులు నమోదైన రైస్ మిల్లర్లు మళ్లీ సీఎంఆర్ రైస్ కోసం అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ ప్రభుత్వం డిఫాల్ట్ రైస్ మిల్లులపై కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన కొందరు నేతల సహకారంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మళ్ళీ దగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.