ఆయుష్మాన్ భారత్ పేరుతో అందిన కాడికి దోచిన సీఆర్టీ ఉపాధ్యాయుడు..

by Sumithra |
ఆయుష్మాన్ భారత్ పేరుతో అందిన కాడికి దోచిన సీఆర్టీ ఉపాధ్యాయుడు..
X

దిశ, మంచిర్యాల టౌన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మా న్ భారత్ పేరులో వివరాలు నమోదు చేస్తున్నాం అంటూ అమాయకమైన ప్రజలను బురిడీ కొట్టించి అందిన కాడికి దోచుకున్న నిందుతున్ని అదుపులోకి తీసుకొని వివరాలు వెల్లడించారు మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీసులు. మంచిర్యాల కేంద్రంలోని స్థానిక డీసీపీ కార్యాలయం లో తాండూర్ సీఐ కే.శ్రీనివాస్ రావు ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో నిందుతుడి వివరాలు తెలియజేశారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కల్వడ గ్రామానికి చెందిన నాయిని బాపు దహెగాంలోని ఆదర్శ పాఠశాలలో సీఆర్టీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.

కుటుంబ పోషణ అధికమై వచ్చే జీతం సరిపోక సులభంగా డబ్బు సంపాదించాలనే వాంఛతో నిరక్షరాస్యు లైన గ్రామీణ ప్రజలను మోసం చేస్తూవచ్చాడు. ఆయుష్మాన్ భారత్ లో పేర్లు నమోదు చేస్తున్నట్లు మాయమాటలు చెప్పి వారి నుండి ఆధార్ కార్డ్, బయోమెట్రిక్ ద్వారా వారి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఆన్లైన్ అప్లోడ్ అయినటువంటి పే నియర్ బై, స్పైసీ మనీ , మనీ మిత్రలో వీరి వివరాలు నమోదు చేసి వాటిలో రుణం తీసుకుని వారిని మోసం చేశాడని. దాదాపు మూడు లక్షల వరకు విరి పేరుమీద రుణం తీసుకొని వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తున అన్నట్లు నమ్మబలికి నిరక్ష్యరాసులు అయిన గ్రామీణ ప్రజలను మోసం చేసినట్లుగా తెలిపారు. నిందితుడు నుండి ఒక ధ్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్ లు, ఒక బయోమెట్రిక్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

Next Story

Most Viewed