మాటకు కట్టుబడి ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్..ప్రకాష్ రాథోడ్

by Disha Web Desk 20 |
మాటకు కట్టుబడి ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్..ప్రకాష్ రాథోడ్
X

దిశ, ఇచ్చోడ : ఇచ్చిన మాటకు కట్టుబడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని ఏఐసీసీ ఎన్నికల పరిశీలకులు, కర్ణాటక ఎమ్మెల్సీ రాథోడ్ ప్రకాశ్ అన్నారు. సోమవారం ఇచ్చోడ మండలంలోని చించొలి, మెడిగూడా గ్రామాల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల గురించి ఇంటింటా ప్రచారం నిర్వ హించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రతి అర్హులైన లబ్ధిదారులందరికీ ఆరు గ్యారంటీ హామీలు గృహజ్యోతి, రైతు భరోసా, ఆరోగ్య జ్యోతి, యువ వికాసం, గృహ లక్ష్మీ, చేయూత లాంటి పథకాలను అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఆరు గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు నరేష్ జాధవ్, ఆడే గజేందర్, వన్నెల అశోక్, రాథోడ్ పార్వతి, కొమురం కొటేశ్వర్, మైమూద్ ఖాన్, ఆషిఫ్ ఖాన్, చోలే ప్రభాకర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story