బెల్లంపల్లిలో కాంగ్రెస్ సంబరాలు..

by Disha Web Desk 20 |
బెల్లంపల్లిలో కాంగ్రెస్ సంబరాలు..
X

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సంబరాల్లో కార్యకర్తలు మునిగిపోయారు. ఆదివారం జరిగిన కౌంటింగ్ ఫలితాలు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ అఖండ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో బెల్లంపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు బాణ సంచాలు పేల్చారు. 22 వేల అధిక్యతలో గడ్డం వినోద్ ఉండడంతోనే సంబరాలు మొదలయ్యాయి.

బెల్లంపల్లి పటంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రధాన వీధుల్లో కార్యకర్తలు బాణాసంచాలు పేలిచారు. దశాబ్దల తర్వాత బెల్లంపల్లిలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం దక్కడంతో కార్యకర్తల్లో ఆనందానికి అవధులు లేవు. ప్రధాన వీధుల్లో కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు దద్దరిల్లాయి. గడ్డం వినోద్ గెలవడంతో కాంగ్రెస్ శ్రేణులు మిఠాయిలు పంచారు. డప్పులు నృత్యాలతో సందడి చేశారు.Next Story