ప్రేమించిన అమ్మాయి కోసం ప్రియుడి ధర్నా..

by Disha Web Desk 13 |
ప్రేమించిన అమ్మాయి కోసం ప్రియుడి ధర్నా..
X

దిశ, లక్షెట్టిపేట: ప్రేమించిన అమ్మాయి కోసం ప్రియుడు, అతని తల్లి ఆమె ఇంటి ఎదుట బైఠాయించి.. ధర్నా చేసిన ఘటన శుక్రవారం లక్షెట్టిపేటలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానిక మహాలక్ష్మి వాడ కాలనీకి చెందిన చాతరాజు ప్రవీణ్, ఇక్కడే ప్రభుత్వ వసతి గృహంలో పని చేసే అమ్మాయిని గత ఆరు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటామని చెప్పిన ఆమె తన వద్ద నుంచి రూ. 5 లక్షల నగదు, నగలు తీసుకుందని ప్రవీణ్ తెలిపాడు. కాగా, తమ ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి కుటుంబ సభ్యులు ఆమెకు వేరే సంబంధం చూశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ.. ఆమె ఇంటి ముందు బైఠాయించి నిరసనకు దిగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.


Next Story

Most Viewed