బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. ప్రచారాన్ని అడ్డుకున్న మహిళలు

by Disha Web Desk 11 |
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. ప్రచారాన్ని అడ్డుకున్న మహిళలు
X

దిశ, లోకేశ్వరం: కనీసం త్రాగునీరు కూడా లేదు, సీసీ రోడ్లు లేవు, మళ్లీ అభివృద్ధి చేస్తానని అంటే ఎలా నమ్మాలి అని మహిళలు ముధోల్ బీ.ఆర్.ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే విట్టల్ రెడ్డిని ప్రశ్నించారు. సోమవారం లోకేశ్వరం మండలంలోని సేవాలాల్ తండా, లక్ష్మీ నగర్ తండా, సాథ్ గాం, హద్గాం, హావర్గా , మన్మధ్, రాజురా తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి నగర్ తండాలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ... రెండు సార్లు అవకాశం ఇచ్చారు. మళ్లీ ఒకసారి అవకాశం ఇస్తే గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని అనగా రెండు సార్లు గెలిపిస్తే ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని, కనీసం మిషన్ భగీరథ త్రాగునీరు కూడా రావడం లేదని, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టలేదని, ఓట్ల సమయంలో మాత్రమే వచ్చే మీరు తర్వాత వెనుకబడిన ప్రాంతాలను మరిచిపోవడం జరుగుతుందని, మళ్లీ ఓట్లు ఎలా వేయాలని పలువురు మహిళలు ప్రశ్నించారు. వారి మాటలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే మాట్లాడి వెళ్లిపోయారు. అనంతరం వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అడిగారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు లోలం శ్యాంసుందర్ ,పడకండి రమాదేవి, కరిపే శ్యాంసుందర్, భుజంగరావు, నర్సింగరావు, రత్నాకర్ రావు, సాయా రెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story