పరిపాలనను గాలికి వదిలేసిన సీఎం కేసీఆర్ : సీఎల్పీ నేత బట్టి విక్రమార్క

by Disha Web Desk 20 |
పరిపాలనను గాలికి వదిలేసిన సీఎం కేసీఆర్ : సీఎల్పీ నేత బట్టి విక్రమార్క
X

దిశ, బెల్లంపల్లి : దేశ చరిత్రలో సచివాలయానికి రాకుండా పరిపాలన గాలికి వదిలేసీ తిరుగుతున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బెల్లంపల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తూర్పుర బట్టారు. తొమ్మిదేళ్లుగా సీఎం కేసీఆర్ సచివాలయానికి రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడని విమర్శించారు. సింగరేణిలో ఓటమి భయంతో ఎన్నికలను నిర్వహించడం లేదని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొత్త కొత్త పథకాలతో ప్రజలను సీఎం కేసీఆర్ మభ్యపెట్టడం అలవాటు అన్నారు. సీఎం కేసీఆర్ భ్రమల్లో ప్రజలు పడద్దన్నారు. సింగరేణి పరిశ్రమను ప్రైవేటు శక్తులకు అమ్మడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు.

తెలంగాణ వస్తే ఉద్యోగాలు పెరగాలి కానీ ఉన్న ఉద్యోగాలు పోయాయని విమర్శించారు. తెలంగాణ వస్తే బతుకులు బాగు బాగుపడతాయనుకుంటే ఉన్న బతుకులు నాశనమయ్యాయని విమర్శించారు. సింగరేణిలో ఒకప్పుడు 1,60,000 కార్మికులకు ప్రస్తుతం 50,000 మాత్రమే మిగిలారని తెలిపారు. తెలంగాణ రాకతో అభివృద్ధి కంటే నష్టమే ఎక్కువ జరిగిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు కొంగుబంగారమైన సింగరేణి సంస్థలో 90% స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఉండేవన్నారు. ప్రైవేటు వాళ్లకు దార దత్తం చేయడంతో స్థానికులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని వాపోయారు. గృహలక్ష్మి పథకానికి నిర్దేశించిన రూ.3 లక్షలకు బదులు రూ.6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి బెల్లంపల్లి ప్రజలకు సక్రమంగా తాగునీరు అందేదని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తాగునీరు నిలిపివేసి ఆడప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ నీరును అందిస్తున్నారని తెలిపారు. పూర్తిగా కలుషితమైన మిషన్ భగీరథ ప్రాజెక్టు మీరు సరిపడగా ఇవ్వడం లేదని విమర్శించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుపనులు ఇంకా పూర్తి కూడా కాలేదని అన్నారు. దళిత బంధు స్కీముకు బడ్జెట్లో కేటాయించిన రూ. 17,500 కోట్లు మంజూరు కాలేదని విమర్శించారు. ప్రజలను మోసం చేయడం ఒక్క తెలంగాణ సీఎంకే సాధ్యమని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ స్కీం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో గృహ నిర్మాణ పథకంలో ఇంటికి లక్ష రూపాయలు ఇచ్చామని తెలిపారు.

ఈ లెక్కన సీఎం కేసీఆర్ చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ కు సరిపడ నిధులు ఇవ్వాలా లేదా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ బెడ్ నిర్మాణం ప్రభుత్వ చిత్తశుద్ధి లేకనే పేద ప్రజలకు రెండు పడకల ఇల్లు దక్కలేదని విమర్శించారు. బెల్లంపల్లి ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. తాగునీరు అందించలేని పరిస్థితిలో మిషన్ భగీరథ ప్రాజెక్టు ఉందని విమర్శించారు. ఖాళీగా ఉన్నలక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు బృతి లేకుండా చేస్తున్నారని విమర్శించారు.

బెల్లంపల్లిలో పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కళాశాలను అప్డేట్ చేస్తామన్న మాటను ప్రభుత్వం నేర్పుకోలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించడం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే అసమర్ధ ఎమ్మెల్యే అని విమర్శించారు. భూకబ్జాలు తప్ప అతనికి ప్రజల అభివృద్ధి తెలియదన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మదన్ మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత, కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు బండి ప్రభాకర్, కాంగ్రెస్ బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జి చిలుముల శంకర్, నియోజవర్గ నాయకులు నాతర స్వామి పాల్గొన్నారు.

Next Story