మెరుగైన వైద్య సేవలు అందించాలి

by Naveena |
మెరుగైన వైద్య సేవలు అందించాలి
X

దిశ, వాంకిడి : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, ఔషధ నిల్వలు, రిజిస్టర్లు, పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే ప్రజల పట్ల వైద్యులు, సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, వారి ఆరోగ్య సమస్యలపై మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఆసుపత్రిలో అవసరమైన ఔషధ నిల్వలు అందుబాటులో ఉంచాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వైద్యులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉంటూ విధుల పట్ల సమయపాలన పాటించాలని, ప్రజలకు అవసరమైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed