అశోక్ సామ్రాట్ జయంతి వేడుకలు

by Dishanational1 |
అశోక్ సామ్రాట్ జయంతి వేడుకలు
X

దిశ, చింతలమానేపల్లి: మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహాల వద్ద గురువారం అంబేడ్కర్ విగ్రహానికి, అశోక్ సామ్రాట్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బౌద్ధ సంఘం తాలుక అధ్యక్షులు బాసర్కర్ విశ్వనాథ్ మాట్లాడుతూ 'సామ్రాట్ అశోక్ కలింగ యుద్ధంలో విజయం సాధించిన అనంతరం, యుద్ధంలో అనేక వేలమంది ప్రజలు మరణించడంతోపాటు ఇండ్లు ధ్వంసమవడం అశోకుడు గమనించాడు, ఇంతటి నష్టం జరగటానికి నేనే కారణమని గ్రహిస్తూ బాధపడ్డాడు, ఇకనుంచి శాంతియుత మార్గంలో నడవాలని ప్రతిజ్ఞ చేశాడు. బౌద్ధ మతం స్వీకరించిన అనంతరం, భారత దేశ ప్రజలకు ప్రజాసౌమ్యనికి ప్రతీక అయినటువంటి అశోక ధర్మచక్రం దేశ ప్రజలకు అంకితం చేశారు' అని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ అతని అడుగు జాడల్లో నడవాలని, శాంతియుత మార్గంలోనే వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాలుక సంయుక్త కార్యదర్శి డోంగ్రే సదాశివ్, మండల అ్యక్షులు ముడిమాడుగుల నర్సయ్య పాపయ్య, విలాస్ తదితరులు పాల్గొన్నారు.


Next Story