''నిర్మల్‌కు మెడికల్ కాలేజ్ కేటాయింపు అంతా మోసమే''

by Disha Web Desk 19 |
నిర్మల్‌కు మెడికల్ కాలేజ్ కేటాయింపు అంతా మోసమే
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అబద్దాలతో కాలం వెళ్లదీస్తున్నారనీ ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం నిర్మల్‌లోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెడికల్ కాలేజీ మంజూరు పేరుతో మోసం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం రిలీజ్ చేసిన బడ్జెట్ అలాట్‌మెంట్‌లో అన్ని జిల్లాల పేరు ఉండగా.. నిర్మల్ పేరు ఎందుకు లేదని ప్రశ్నించారు. ఎసెన్షియల్ సర్టిఫికేట్ పేరుతో మరోసారి నిర్మల్ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రైల్వే లైన్ పేరుతో మోసం చేశారని, ఎనిమిదేళ్ళ నుంచి మంత్రిగా ఉండి ఇంత వరకూ ఏమీ చేయలేదన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీ పేరుతో ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా, పెద్ద ఆస్పత్రి సౌకర్యాలు లేకుండా ఎలా మెడికల్ కాలేజీ మంజూరు చేస్తారో చెప్పాలన్నారు.

వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి: ఏలేటి

తమ డిమాండ్ల సాధన కోసం లక్ష్మణ్ చందా మండల కేంద్రములో దీక్షలు చేస్తున్న వీఆర్ఏలకు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వం మొత్తం రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. అటు వీఆర్వో, ఇటు వీఆర్ఏ లను ఆగం చేస్తున్నారని ఆరోపించారు. రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో వీఆర్ఏల న్యాయమైన డిమాండ్‌లను నెరవేరుస్తామని మహేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.


Next Story