ఏసీబీ వలలో వ్యవసాయ అధికారి

by Aamani |
ఏసీబీ వలలో వ్యవసాయ అధికారి
X

దిశ,కాగజ్ నగర్ : కొమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం దహేగాం మండలం వ్యవసాయ అధికారి సోమవారం ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మండలానికి చెందిన చౌదరి శ్యామ్ రావు అనే వ్యక్తి ఫర్టిలైజర్ షాప్ కి రెన్యువల్ కోసం వ్యవసాయ అధికారిని సంప్రదించగా రూ.38 వేలు డిమాండ్ చేశాడు. దీంతో సదరు ఫర్టిలైజర్ యజమాని ఏసీబీ అధికారులను సంప్రదించగా వ్యవసాయ కార్యాలయంలో రూ.38 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ .హ్యాండెడ్ గా పట్టుబడినట్లు ఎసీబీ అధికారులు తెలిపారు.

Next Story