ఎమ్మెల్యేనై ఉన్నా పోలీస్ ఎస్కార్ట్ తీసేశారు : అజ్మీరా రేఖ శ్యాంనాయక్

by Sumithra |
ఎమ్మెల్యేనై ఉన్నా పోలీస్ ఎస్కార్ట్ తీసేశారు : అజ్మీరా రేఖ శ్యాంనాయక్
X

దిశ, ఖానాపూర్ : నేను ప్రజలతో ఎన్నుకోబడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే నై ఉన్న ప్రభుత్వం ఇవ్వాలిసిన పోలీస్ ఎస్కార్ట్ రాకుండా చేస్తున్నారు అని నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాం నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను ఇంకా పార్టీ మారలేనని, ఎమ్మెల్యేకు ఇవ్వవలసిన పోలీస్ ఎస్కార్ట్ నిన్నమొన్న వచ్చిన వాళ్లకు పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వడం ఏంటి అని పరోక్షంగా ఆరోపించారు. నియోజవర్గాన్ని ఎంతో అభివృద్ధి బాటలో, సంక్షేమ పథకాలతో గత రెండు దపాలతో ప్రజల సంక్షేమములతో గిరిజన మహిళ అయిఉండి అన్నిరంగాలలో నియోజవర్గాన్ని అభివృద్ధి బాటలో నిలిచానని ఎమ్మెల్యే అజ్మీర రేఖ శ్యాం నాయక్ అన్నారు. గతసంవత్సరం నుండి నియోజవర్గంలోని అభివృద్ధి పనులకు నిధులు రాకుండా అడ్డుపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి అభివృద్ధి పనులకు నిధులు ఆపడని, నియోజకవర్గంకు రవాల్సిన ఏసీడీపీ నిధులు మంత్రి అపుతూతున్నారు అని, వేరే అభ్యర్థి కోసం ఏసీడీపీ నిధులు ఆపడం ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఏసీడీపీ నిధులు రాకుండా అడ్డుపడితే తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేస్తానని మంత్రిని హెచ్చరించారు. ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు ఎంతో శాయశక్తులతో కృషి చేస్తే కొందరు రోడ్డు వైడింగ్ పనులు చేయకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ విధుల్లో ఉన్న సమస్యలను తీర్చకుండా బీఆర్ఎస్ అభ్యర్థి దగ్గర ఏమి చేస్తున్నావు అని ప్రశ్నించారు. అంతేకాకుండా పెంబి మండలంలోని పసుపుల బ్రిడ్జి పనులు కాకుండా అడ్డుపడుతున్నారు అని అన్నారు. మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూమ్ ల ప్రారంభోత్సవానికి వస్తారని చెప్పిన రాకుండా అడ్డుకున్నారని పరోక్షంగా ఆరోపించారు. నేను ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని ఆమె తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేసినా తనకుఎంతో సంతోషమని ఆమె తెలిపారు. నియోజవర్గ అభివృద్ధికి తాను ఇప్పుడు అడ్డుకానని ఆమె అన్నారు. తాను ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలని గుర్తు చేస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.

Advertisement

Next Story

Most Viewed