అవినీతి అధికారులపై ఏసీబీ ఫోకస్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో వరుస దాడులు

by Aamani |
అవినీతి అధికారులపై ఏసీబీ ఫోకస్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో వరుస దాడులు
X

దిశ, ఆసిఫాబాద్ : జిల్లాలో ఏసీబీ దాడులు సోదాలతో అవినీతి అధికారుల కంటిమీద కునుకు లేకుండా హడలెత్తి తున్నారు. ఇప్పటికే పలు అవినీతి శాఖ పై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. లంచగొండి అధికారుల భారతం పడుతున్నారు. అవినీతి సొమ్ము కు అలవాటు పడిన ప్రభుత్వాధికారులు వరుసగా ఏసీబీ వలలో చిక్కుకున్నారు. జిల్లాలో 40 రోజుల వ్యవధిలో ఐదు రైడ్ లు నిర్వహించిన ఏసీబీ అధికారులకు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు చిక్కారు. మరో ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారుల పై ఏసీబీ దాడులు జరుగుతుండడంతో లంచగొండి అధికారుల్లో వణుకు పుడుతోంది.

ఆదిలాబాద్ ,నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. బాధితులు చేస్తున్న ఫిర్యాదులతో రంగంలోకి దిగుతున్న ఏసీబీ ప్లాన్ ప్రకారం లంచగొండులను ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారి ఆటకట్టిస్తోంది. పలుశాఖల్లోని అధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది అవినీతి ఆరోపణల పై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వారిపై ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు జరుగుతున్న ఏసీబీ దాడులు సృష్టం చేస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే ఏసీబీ బృందాలు వరుసగా దాడులు నిర్వహిస్తుండటంతో అవినీతి అధికారులు. సిబ్బంది గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.

ఏసీబీ దాడులు...

ఏప్రిల్ 15న మొదటి సారిగా ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ రాజ్యలక్ష్మి స్టేషన్ బెయిల్, వాహనం రిలీజ్ కోసం మంచిర్యాల జిల్లా సీసీసీ నన్సూర్ కు చెందిన యహియాశాన్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఏప్రిల్ 24న నాలుగు వరుసల రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం చెల్లింపులో భారీ అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుతో ఆసిఫాబాద్ ఎస్బీఐ బ్యాంక్ తో పాటు ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. అప్పటి ఆర్డీవో సీడాం దత్తు. డిప్యూటీ తహసీల్దార్ మెస్రం నాగోరావు సర్వేయర్ భారత్ లతో పాటు మరో నలుగురిపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మే 22న నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీ కమిషనర్ వెంకటేశ్వర్లు,బిల్ కలెక్టర్ విద్యాసాగర్ భవనం నిబంధనల ప్రకారం నిర్మించలేదని పట్టణానికి చెందిన లాలాషరిపి రాజేశ్వం నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు ఏసీబీ పట్టుబడ్డారు.

మే 27న ఆసిఫాబాద్ జిల్లా దాహెగాం మండల వ్యవసాయ అధికారి వంశీ కృష్ణ ఫర్టీలైజర్ షాపు లైసెన్స్ రెన్యువల్ కోసం చౌదరి శ్యామ్ రావు నుంచి రూ.38 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

మే 28న ఆదిలాబాద్ ఫోర్జ్ చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి చేసి సోదాలు నిర్వహించారు. లెక్కలకు రాని రూ.11 వేలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని అవినీతి అధికారులతో పాటు అధికంగా అక్రమాలు జరిగే రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖలపై ఏసీబీ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఏసీబీ దాడుల్లో అవినీతి అధికారులు పెట్టుకుంటుండడంతో ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story