ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య..

by Kalyani |
ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య..
X

దిశ,బెల్లంపల్లి: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో చోటు చేసుకుంది. బెల్లంపల్లి తాళ్ల గురజాల ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష పేట మండలం కుందారం గ్రామానికి చెందిన దేశ రాజుల సంతోష్ తల్లిదండ్రులతో మూడు రోజుల క్రితం మండలంలోని బుచ్చయ్యపల్లి గ్రామానికి బంధువుల ఇంటికి వచ్చాడు. హుస్నాబాద్ లో డిప్లమా చేస్తున్న దేశ రాజుల సంతోష్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని తల్లిదండ్రులకు చెప్పాడు.

వివాహం కోసమై సదరు అమ్మాయి తల్లిదండ్రులను సంతోష్ కుటుంబ సభ్యులు అడిగారు. అందుకు అమ్మాయి తల్లిదండ్రులు ఇప్పుడే పెళ్లి చేయమని నిరాకరించారు. ప్రేమించిన అమ్మాయి వివాహానికి నిరాకరించడంతో సంతోష్ మానసికంగా కుంగుబాటుకు లోనయ్యారు. గ్రహించిన తల్లిదండ్రులు నచ్చ చెప్పారు. ప్రేమించిన అమ్మాయి దక్కలేదని మనస్థాపానికి గురైన సంతోష్ ఇంట్లో ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.

Next Story