విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయురాలు..

by Disha Web |
విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయురాలు..
X

దిశ, బెజ్జుర్ : ఈ మధ్యకాలంలో కొంత మంది ఉపాధ్యాయులు విద్యార్ధులను చితకబాదిన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఉపాధ్యాయురాలు నాలుగవ తరగతి చుదువుతున్న ఓ విద్యార్థిని చితకబాదింది. ఈ సంఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం ఎలుకపెళ్లి బీ లో బుధవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తివివరాల్లోకెళితే ఎలుకపెళ్లి బి పాఠశాల ఉపాధ్యాయురాలు లక్ష్మిప్రసన్న 4వ తరగతి చదువుతున్న శ్రీరామ అక్షర అనే విద్యార్ధినిని అకారణంగా చితకబాదింది.

దీంతో అక్షరకు కుడికనితి పై బొబ్బలు రావడంతో విద్యార్థిని తన తల్లిదండ్రులకు తెలడంతో వారు ఆందోళన చెందారు. ఉపాధ్యాయురాలు లక్ష్మిప్రసన్న ఇదివరకే బెజ్జూరు గ్రామ సర్పంచ్ శారద కూతురు కోట్రంగి అశ్విని అనే విద్యార్థిని పైన కూడా చేయిచేసుకుంది. ఈ విషయం పై మండల విద్యాధికారి రమేష్ బాబుకు ఫిర్యాదు చేయగా, బెజ్జూరు కాంప్లెక్స్ హెచ్ఎం రవికుమార్, సీఆర్పీ శ్రీనివాస్ సందర్శించి వివరాలు సేకరించారు.


Next Story