ప్రతి ఇంటి వద్ద న్యూట్రిషన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలి : కలెక్టర్ వరుణ్ రెడ్డి

by Disha Web Desk 15 |
ప్రతి ఇంటి వద్ద న్యూట్రిషన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలి : కలెక్టర్ వరుణ్ రెడ్డి
X

దిశ, కడెం : ప్రతి ఇంటి వద్ద న్యూట్రిషన్ గార్డెన్ ఏర్పాటు చేసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూరు పంచాయతీ పరిధిలోని కలెక్టర్ దత్తత గ్రామమైన కొలంగూడ గ్రామంలో ఇంటింటికీ న్యూట్రిషన్ గార్డెన్ కార్యక్రమంలో బుధవారం ఇండ్ల వద్ద ఏర్పాటు చేసిన కిచెన్ న్యూట్రిషన్ గార్డెన్ లో జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి కూరగాయల విత్తనాలు, మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలంటే పోషకాహారాలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

న్యూట్రిషన్ గార్డెన్ ఇంటి వద్ద ఏర్పాటు చేసుకుంటే అందులో పండిన వివిధ రకాల కూరగాయలు మనం తీసుకోవడం వలన ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. కూరగాయలను మార్కెట్ కు తీసుకువెళ్లి అమ్ముకుంటే మంచి లాభాలు వస్తాయని అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ ఇండ్ల వద్ద ఉన్న తోటలలో, ఖాళీ స్థలాలలో తప్పక అన్ని రకాల కూరగాయల మొక్కలను వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ విజయలక్ష్మి, ఏపీడీ గోవిందరావు, ఐసీడీఎస్ పీడీపీఓ సరిత, తహసీల్దార్ చిన్నయ్య, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏపీఓ జయదేవ్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed