ఘనంగా బోనాల పండుగ

by Sridhar Babu |   ( Updated:2023-07-13 10:41:36.0  )
ఘనంగా బోనాల పండుగ
X

దిశ , అశ్వాపురం : మండల కేంద్రం అయిన అశ్వాపురం లోని కాలువ బజారు కాలనీల్లో గురువారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గురువారం ఏకాదశి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మహిళలు బోనాల పండుగను జరిపారు. మేళ తాళాలతో బోనాలను ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి దేవునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా తల వెంకటేశ్వర్లు దంపతులు సాయిబాబా ఆలయంలో ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నల్లగట్ల సత్య ప్రకాష్, పెద్దల రామకృష్ణ, ఇసంపల్లి కృష్ణ, కొడారి వెంకటేశ్వర్లు, మడిపల్లి రమేష్, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



Next Story

Most Viewed