- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పైలెట్ ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

దిశ, ఇంద్రవెల్లి : ప్రభుత్వం ప్రారంభించిన పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణను గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ ప్రజావాణికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్,ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్ తో పాటు ఐటీడీఏ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. మండలంలో గతంలో జిల్లా స్థాయిలో సమర్పించిన మొత్తం 257 దరఖాస్తులపై హియరింగ్ నిర్వహించారు. ఈ ప్రజావాణిపై కిసాన్ మిత్ర అనే స్వచ్ఛంద సంస్థ మారుమూల గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులు ఉన్నా లబ్ధి పొందలేని బాధితులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కానీ అనేక గ్రామాల్లో ఈ ప్రజావాణి పై అవగాహన లేకపోవడంతో అధిక సంఖ్యలో పాల్గొనలేదు. సమ్మక్క, కేస్లాగూడ, పిట్ట బొంగరం కు చెందిన ఆదివాసులు తమకు రుణ మాఫీ కాలేదని, పీఎం కిసాన్ పథకం అందలేదని ఫిర్యాదు చేశారు.
పిట్ట బొంగరంకు చెందిన వెట్టి ఆనంద్ రావ్ తాను 157 సర్వే నెంలో ఉన్న 5.0 ఎకరాల భూమిని గత 30 ఏండ్లు నుంచి సాగుచేస్తున్నానని ఇంత వరకు తన పేరు మీద పట్టా కాలేదని కలెక్టర్ ముందు విన్నవించారు. గతంలో పని చేసిన ఓ వీఆర్వో కుమ్రా హీరామన్ పేరిట పట్టా చేశాడని మొరపెట్టుకున్నాడు. స్పందించిన కలెక్టర్ వారం రోజులలోపు సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. లేని యెడల ఐటీడీఏ సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ప్యూట్ కేసును నమోదు చేయాలని ఆదేశించారు. కేస్లాగూడ కు చెందిన హెచ్.కే.గంగారాం తనకు గృహజ్యోతి కింద జీరో బిల్లు రావడం లేదని, రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేశారు.
అనేక మందికి ఒకే కుటుంబంలో రెండు లక్షలకు పైన రుణం ఉన్న వారికి రుణ మాఫీ కాలేదని అధికారులు సమాధానమిచ్చారు. దాంతో పాటు అనేక మందికి గ్యాస్ సబ్సిడీ రావడం లేదని ఫిర్యాదులు చేశారు. మండలంలో మొత్తం 257 దరఖాస్తులు రాగా కేవలం 60 దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయి. ఈ ప్రజావాణిలో డీఅర్డీఓ రాథోడ్ రాజేశ్వర్, సీఈఓ జితేందర్ రెడ్డి, తహసీల్దార్ ప్రవీణ్, డీఎల్పీఓ ఫణీంద్ర రావ్, కిషన్ మిత్ర రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ హర్ష, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు తదితరులు పాల్గొన్నారు.