- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
రసాయన నీళ్లు తాగి 15 మేకలు మృత్యువాత..
by Disha web |

X
దిశ, తాంసి: మేత కోసం పంటచేనులకు వెళ్లిన మేకలు రసాయనాలు కలిపిన నీటిని తాగి మృత్యువాత పడిన ఘటన తాంసి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన పుట్ట పెంటన్న మంగళవారం మేత కొరకు 40 మేకలను పంట చేనులోకి తీసుకెళ్లాడు. పశుగ్రాసం తినే సమయంలో పంట చేనులో నిల్వ ఉన్న రసాయనాలతో కూడిన నీళ్లను తాగడంతో 15 మేకలు ఘటన స్థలంలో మృతి చెందగా, కొన్ని మేకలు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న పశువైద్యాధికారి శ్రీకాంత్ సిబ్బందితో కలిసి చికిత్స అందించారు. కాగా మేకలే జీవనాధారంగా కుటుంబాన్ని పోషిస్తున్న తనకు ఒకేసారి 15 మేకలు మృతి చెందడంతో కన్నీరుమున్నీరయ్యాడు. రూ. లక్షకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తరపున పరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు.
Next Story