మద్యంలో అది కలుపుకొని తాగిన వ్యక్తి

దిశ, వెబ్ డెస్క్: మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన పనికి అంతా షాక్‌కు గురయ్యాడు.మద్యం మత్తులో వాటర్‌కు బదులు యాసిడ్ కలుపుకొని తాగిండు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లాలో హాజీపూర్‌ మండలం ముల్కల్ల గ్రామానికి చెందిన ఎర్రవేని మహేశ్ (29) అనే యువకుడు సింగరేణిలో జాబ్ చేస్తున్నాడు. ఇతనికి మందు మద్యం అలవాటు ఉండడంతో ఓ రోజు మద్యం ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంట్లో కూర్చోని తాగే క్రమంలో వాటర్‌కు బదులు యాసిడ్ కలుపుకొని తాగాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు వెంటెనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిసింది. మహేశ్‌కు భార్య స్వర్ణలత, కుమారుడు, కూతురు ఉన్నారు.