- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
Actor Sanjay Raichura: బీజేపీలోకి టాలీవుడ్ యాక్టర్ చేరిక

దిశ, వెబ్‌డెస్క్ : Actor Sanjay Raichura Joins BJP In the Presence Of Eatala Rajender| తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ చేరికలపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీతో పాటు అధికార పార్టీలోని కీలక నేతలకు పార్టీ కండువా కప్పేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ పార్టీల నుండి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారి జాబితాను అధిష్టానం వద్దకు తీసుకెళ్లిన తెలంగాణ బీజేపీ నేతలు ఆ దిశగా కసరత్తును స్పీడప్ చేశారు. కాంగ్రెస్ నుండి దాసోజు శ్రవణ్ వంటి మేధావి వర్గాన్ని పార్టీలో చేర్చుకోగా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఈ నెల 21న బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ క్రమంలో రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు ప్రధానంగా ఉద్యమ కారులను బీజేపీలో చేర్చుకోవడంపై దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేకంగా చేరికల కమిటీని సైతం నియమించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో చేరికల పర్వం కొనసాగుతోంది.
తాజాగా ప్రముఖ సినీ నటుడు సంజయ్ రాయిచుర బీజేపీలో చేరారు. శనివారం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆయనకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంజయ్ రాయిచుర మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ విజన్, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాల పట్ల ఆకర్షితుడనై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఆచార్య, మహార్షి వంటి సినిమాలతో పాటు పలు దక్షిణ భారత సినిమాలు, సీరియళ్లలో సంజయ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సంజయ్ చేరిక పార్టీకీ బలోపేతం చేస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు ఈటల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభతో పాటు తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: ''మేం పోస్టర్లు వేయడం మొదలు పెడితే తట్టుకోలేరు''.. బండి వార్నింగ్