కొల్లాపూర్‌లో బర్రెలక్కకు ఎన్ని వేల ఓట్లు వస్తాయంటే..? ఎగ్జిట్‌పోల్‌లో తేలింది ఇదే!

by Disha Web Desk 7 |
కొల్లాపూర్‌లో బర్రెలక్కకు ఎన్ని వేల ఓట్లు వస్తాయంటే..? ఎగ్జిట్‌పోల్‌లో తేలింది ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రజలు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతల ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే సర్వే సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ను ప్రకటించాయి. తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి..? అధికారం చేపట్టబోయేది ఏ పార్టీ అనే దానిపై సర్వే రిపోర్ట్‌ను ప్రకటించాయి. జిల్లాల వారిలో ఓ నియోజకవర్గంలో ఏ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది..? ఏ అభ్యర్థి గట్టిపోటీ ఇస్తున్నాడనేది వివరించాయి. ఈ క్రమంలోనే కొల్లాపూర్ నుంచి బరిలో దిగిన బర్రెలక్క విజయం సాధిస్తుందా..? లేదా అనేది ఆరా మస్తాన్ తన సర్వేలో ప్రకటించింది.

నిరుద్యోగుల పక్షాన కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శిరీష అలియాస్ బర్రెలక్క విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ క్రమంలో ఆమె తమ్ముడు, అనుచరులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో బర్రెలక్కకు ఫాలోయింగ్ పెరిగింది. హైకోర్టు ఆదేశాలతో ఆమెకు నలుగురు గన్‌మాన్లను కేటాయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు కొల్లాపూర్ వచ్చి బర్రెలక్క తరుఫున ప్రచారం చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చిన బర్రెలక్కకు ఆరా మస్తాన్ సర్వే సంస్థ షాకిచ్చింది. ప్రజల నుంచి శిరీషకు మంచి మద్దుతు లభించినప్పటికీ ఓట్లు మాత్రం 15 వేల వరకు రావచ్చని ఆరా మస్తాన్ సర్వే తెలిపింది. అయితే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జూపల్లి కృష్ణారావు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. బర్రెలక్క గెలవకపోయినా గట్టి పోటీ ఇస్తారని ఈ సర్వే వెల్లడించింది.

Next Story

Most Viewed