బ్రేకింగ్: సికింద్రాబాద్‌లో తప్పిన పెను ప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన ఆరు ఫోర్లు

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: సికింద్రాబాద్‌లో తప్పిన పెను ప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన ఆరు ఫోర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌లోని డెక్కన్ స్పోర్ట్ వేర్ మాల్ కూల్చివేతలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల భారీ అగ్ని ప్రమాదానికి గురైన భవనాన్ని కూల్చి వేస్తోన్న క్రమంలో ఒక్కసారిగా మాల్‌లోని ఆరు ఫోర్లు కుప్పకూలాయి. ముందస్తుగానే అధికారులు చుట్టూ పక్క నివాస ప్రాంతాలను ఖాళీ చేయిచండంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం నుండి భవన కూల్చివేత కార్మికులు కూడా బయటపడటంతో అధికారులు ఊపీరిపీల్చుకున్నారు. కాగా, జనవరి 26వ తేదీన సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్‌లోని డెక్కన్ స్పోర్ట్స్ మాల్ వేర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 8 మంది మరణించగా.. భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో భవనం పూర్తిగా దెబ్బతింది. దీంతో అధికారులు భవనాన్ని కూల్చాలని నిర్ణయించారు.

Next Story