ల్యాండ్ సర్వేకు రూ.లక్ష లంచం అడిగిన తహసీల్దార్

by Disha Web Desk 2 |
ల్యాండ్ సర్వేకు రూ.లక్ష లంచం అడిగిన తహసీల్దార్
X

దిశ, అంతర్గాం: పెద్దపల్లి జిల్లాలో అవినీతికి పాల్పడుతూ రెవెన్యూ అధికారులు ఏసీబీకి చిక్కారు. సోమవారం అంతర్గాంలో జరిగిన దాడిలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప్రత్యక్షంగా పట్టుకున్నారు. ఓ భూమి సర్వే చేసేందుకు సర్వేయర్‌కు పనులు పురమాయించేందుకు తహసీల్దార్ రూ.లక్ష లంచం అడిగినట్టుగా ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ సంపత్, సీనియర్ అసిస్టెంట్, ప్రైవేట్ అసిస్టెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ కే.భద్రయ్య ఆధ్వర్యంలో జరిగిన ఆ దాడుల్లో సీఐ రవిందర్, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. తహసీల్దార్ సహా ఇతర అధికారుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసిన తరువాత పూర్తి వివరాలు తెలియజేస్తామని ఏసీబీ వర్గాలు తెలిపాయి.


Next Story