ప్రభుత్వ యూనివర్సిటీల ఫిక్స్డ్ డిపాజిట్లపై రాష్ట్ర ప్రభుత్వ కన్ను: ఏబివీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు

by Ajay Maddhiboyina |

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల ఫిక్స్డ్ డిపాజిట్లపై రాష్ట్ర ప్రభుత్వ కన్ను పడిందని,వాటిని కాజేయాలని ప్రభుత్వo చూస్తున్నదని ఏబివీపి రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలక్రిష్టారెడ్డికి ఏబీవీపీ ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది.

ప్రభుత్వ యూనివర్సిటీల ఫిక్స్డ్ డిపాజిట్లపై రాష్ట్ర ప్రభుత్వ కన్ను: ఏబివీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల ఫిక్స్డ్ డిపాజిట్లపై రాష్ట్ర ప్రభుత్వ కన్ను పడిందని,వాటిని కాజేయాలని ప్రభుత్వo చూస్తున్నదని ఏబివీపి రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలక్రిష్టారెడ్డికి ఏబీవీపీ ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ యూనివర్సిటీ లోని ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రభుత్వ నిధులు కావనీ,అవి వివిధ రకాల ఫీజుల రూపంలో విద్యార్థులు చెల్లించిన సొమ్ము అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాల్సిందిపోయి,విద్యార్థుల ఫీజుల ద్వారా సమకూరిన ఫిక్స్డ్ డిపాజిట్లనే అభివృద్ధికి ఉపయోగించుకోవాలనడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే యూనివర్సిటీల బడ్జెట్ కు సరిపడా బ్లాక్ గ్రాంట్ ఇవ్వకుండా, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు సైతం యూనివర్సిటీ లే సమకూర్చుకునేలా చేసిన ప్రస్తుత ప్రభుత్వం, ఆపదలో ఉపయోగపడే ఫిక్స్డ్ డిపాజిట్లనే యూనివర్సిటీల మనుగడ కోసం వాడుకోవాలనడం,యూనివర్సిటీలు స్వీయ ఆర్థిక అస్థిత్వం సాధించాలనడం చూస్తుంటే ప్రభుత్వం యూనివర్సిటీలను గాలికొదిలేస్తుందా అన్న అనుమానం కలుగుతున్నదని అన్నారు.

ఇప్పటికే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, రెగ్యులర్ కోర్సులలో సైతం అడ్మిషన్లు పొందిన విద్యార్థులు సైతం వేలకువేలు ఫీజులు కట్టి ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువుతున్నారని,ఇప్పుడు ప్రభుత్వం నిధులు కేటాయించకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉపయోగించుకోవాలని అంటే భవిష్యత్తులో జీతాలకు,పెన్షన్లకు సైతం యూనివర్సిటీలు విద్యార్థుల దగ్గర నుండే అధిక మొత్తం ఫీజులు వసూలు చేస్తుందని,ఇది ప్రైవేటీకరణకు దారితీస్తుందని ఆరోపించారు.కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్లపై నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీల బ్లాక్ గ్రాంట్ కి సరిపడా నిధులు కేటాయించాలని,యూనివర్సిటీ లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్,స్కాలర్షిప్ లను రిలీజ్ చేయాలని, యూనివర్సిటీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Next Story