ఓయూ వీసీది కక్ష్యపూరిత చర్య

by Disha Web Desk 21 |
ఓయూ వీసీది కక్ష్యపూరిత చర్య
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉస్మానియా వర్సిటీ వైస్ చాన్సలర్.. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, 10 ఏండ్లకు పైగా చాలీ చాలని జీతాలోవర్సిటీకి సేవలందిస్తున్నారని, వీసీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహారించుకోవాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. బాండ్ అగ్రిమెంట్ విధానం పేరిట ఇబ్బందులకు గురిచేయడంపై ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో 2013లో చేపట్టిన నియామకాల అనంతరం తొమ్మిదేండ్లలో ఒక్కరినైనా రిక్రూట్ చేసుకున్నారా? అని ప్రశ్నించారు. 80 శాతానికి పైగా బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలతో యూనివర్సిటీ ప్రతిభ నానాటికీ దిగజారిపోతోందని ఫైరయ్యారు.

వర్సిటీలో అకడమిక్, పరిశోధన రంగాలకు పెద్దపీట వేయాల్సిన వీసీ ఏదో ఒక సమస్యను సృష్టిస్తూ వర్సిటీని అప్రతిష్టపాటు చేస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్సిటీలో 30 శాతం రెగ్యులర్ అధ్యాపకులతో పాటు 400 మంది కాంట్రాక్టుఅధ్యాపకులతో నెట్టుకొస్తున్నారన్నారు. దాదాపు 10 ఏండ్ల నుంచి 20 ఏండ్లకు పైగా యూనివర్సిటీకి సేవలందిస్తున్న అధ్యాపకులను ఇబ్బందులు పెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాండ్ అగ్రిమెంట్ నిర్ణయాన్ని తక్షణమే వీసీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.


Next Story