ఫస్ట్ ఫ్లైట్‌కే తిరిగి ఢిల్లీ వెళ్లిన CBI టీమ్.. రెండ్రోజులు కవిత అక్కడే!

by Disha Web Desk 2 |
ఫస్ట్ ఫ్లైట్‌కే తిరిగి ఢిల్లీ వెళ్లిన CBI టీమ్.. రెండ్రోజులు కవిత అక్కడే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంలో 160 సీఆర్పీసీ కింద సీబీఐ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత విచారణపై మంగళవారం ఉదయం నుంచి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీబీఐ అధికారులు ఇచ్చిన నోటీసులపై తొలుత డిసెంబర్ 6వ తేదిన విచారణకు తాను సిద్ధంగా ఉన్నట్టు కవిత రిప్లై ఇచ్చారు. అయితే ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేదని అలాగే తనకు ముందుస్తుగా నిర్ణయించుకున్న పనుల కారణంగా డిసెంబర్ 6వ తేదీకి బదులుగా ప్రత్యామ్నాయ తేదీలను సూచిస్తూ కవిత సీబీఐకి నిన్న లేఖ రాశారు. అయితే కవిత లేఖపై 24 గంటలు గడిచినా సీబీఐ అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో ఆమె ఇంటికి విచారణ అధికారులు అధికారులు వస్తున్నారనే ప్రచారం ఉదయం నుంచి జోరుగా వినిపించింది.

కవితను ప్రశ్నించేందుకు ఓ వైపు సీబీఐ బృందం హైదరాబాద్‌కు చేరుకోవడంతో ఈ కేసులో కవితను మంగళవారం ప్రశ్నిస్తారా? లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర ఉత్కంఠ కొనసాగింది. ఇదిలా ఉంటే వివరణ ఇచ్చుకునేందుకు కొత్త తేదీలు సూచించిన నేపథ్యంలో ఆమెను విచారించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన సీబీఐ టీమ్ తిరిగి ఢిల్లీ వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. మంగళవారం ఉదయం ఫస్ట్ ఫ్లైట్‌కే వారు ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయినట్టు తెలుస్తోంది. మరోవైపు కవిత ఈ రోజు జగిత్యాలలో పర్యటించబోతున్నారు. రేపు జగిత్యాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ టూర్, బహిరంగ సభ ఉంది. రేపు జగిత్యాలలో జరిగే సీఎ సభ ఏర్పాట్లను కవిత పరిశీలించనున్నారు. తిరిగి ఆమె బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నట్టు తెలుస్తోంది.

Read more:

కవిత పర్యటన ఖరారు.. CBI నెక్ట్స్ స్టెప్ ఏంటి?


Next Story