నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి

by srinivas |   ( Updated:2024-09-09 05:22:34.0  )
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: నల్గొండ జిల్లా దామచర్ల మండలం బొత్తులపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనాన్ని డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ప్రమాదంతో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పునరుద్ధణ చేశారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story