జాబితాలో మహిళలకు చోటు.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కవిత కౌంటర్!

by Disha Web Desk 4 |
జాబితాలో మహిళలకు చోటు.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కవిత కౌంటర్!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ టిక్కెట్ల కేటాయింపు అంశంలో మీ ఆందోళన మాకు అర్థం అవుతోందన్నారు. మీ రాజకీయ అభద్రతను మహిళా ప్రాతినిధ్యానికి ముడి పెట్టొద్దన్నారు. పార్లమెంట్ లో మహిళా ప్రాతినిధ్యాన్ని 1/3 పెంచాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే సూచించారని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారో చూద్దామన్నారు. మహిళా రిజర్వేషన్లపై బీజేపీ రెండు సార్లు మోసం చేసిందన్నారు.

సంఖ్యా బలం ఉన్నా మహిళా బిల్లును ఎందుకు ఆమోదించట్లేదన్నారు. చట్లసభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లును బీజేపీ తీసుకురావాలన్నారు. చట్టం ఉన్నందుకే స్థానిక సంస్థల్లో 14 లక్షల మహిళలకు ప్రాతినిధ్యం అని కవిత తెలిపారు. ఇక, బీఆర్ఎస్ తొలి జాబితాలో మహిళలకు చోటేది అని నిన్న బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కారుపార్టీపై ఘాటుగా విమర్శలు చేశారు. 33 శాతం రిజర్వేషన్లు కావాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బంగారు కుటుంబ దొంగ సభ్యులు దీక్షలు చేశారని పరోక్షంగా కవితపై సెటైర్లు వేసిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed