కొడుకు పుట్టాడు చూడడానికి రా అని ప్రియుడిని పిలిచిన మైనర్.. తండ్రి ఏం చేశాడంటే..?​

by Rajesh |
కొడుకు పుట్టాడు చూడడానికి రా అని ప్రియుడిని పిలిచిన మైనర్.. తండ్రి ఏం చేశాడంటే..?​
X

దిశ, చార్మినార్​: ఫోక్సో కేసులో జైలు జీవితం గడిపి ఇంటికి వచ్చాడని తెలుసుకున్న ప్రియురాలు మనకు కొడుకు పుట్టాడని చూడడానికి రా... అంటూ ప్రియుడిని పిలిచింది. ప్రియురాలి ఇంట్లోకి ప్రవేశించగానే సి.సి కెమెరా ద్వారా అలర్ట్​ అయిన ఆమె తండ్రి అతనిపై దాడికి తెగబడ్డాడు. అతని నుంచి తప్పించుకుని అదే ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని డయల్​ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసిన బండ్లగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ... పాతబస్తీ గౌస్​ నగర్​కు చెందిన అబ్దుల్​ సోహైల్​ (25) కు అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్​ బాలికతో సంవత్సరం క్రితం పరిచయమయ్యింది.

ఈ నేపధ్యంలోనే వారి మధ్య ప్రేమ చిగురించి పెళ్లికి సిద్దమయ్యారు. మూడు నెలల క్రితం ఆ ప్రేమ జంట ఇంటి నుంచి పరారయ్యింది. మైనర్​ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండ్లగూడ పోలీసులు అబ్దుల్​ సోహైల్​ పై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. 45 రోజులు జైలు జీవితం గడిపిన అనంతరం సోహైల్ బెయిల్​పై ఇటీవల ఇంటికి వచ్చాడు. సమాచారం అందుకున్న ప్రియురాలు మనకు కొడుకు పుట్టాడని ఇంకా వచ్చిచూడవా? అంటూ గత మూడు రోజులుగా సోహైల్​కు ఫోన్​లు చేయసాగింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున 4గంటలకు మరోమారు సోహైల్​ కు ఫోన్​ చేయడంతో ప్రియురాలి ఇంటికి వెళ్లాడు.

ఇంటి దగ్గరకి చేరుకున్నప్రియుడు మీనాన్న కు సంబంధించిన వాళ్లు ఇంటి బయట ఉన్నారని, సి.సి కెమెరాలు ఆన్​లో ఉన్నాయా? అని ప్రియురాలికి ఫోన్​ చేసి అడిగాడు. నేను సి.సి కెమెరాలు ఆఫ్​ చేస్తానని చెప్పడంతో వెనుక మార్గం నుంచి ప్రియుడు ఇంట్లోకి ప్రవేశించాడు. సోహైల్​ ఇంట్లోకి రాగానే సి.సి కెమెరా ద్వారా అలర్ట్​ అయిన ఆమె తండ్రి ​ అతన్ని పట్టుకున్నాడు. సోహైల్​ను చితకబాదుతుండగా అతను తప్పించుకుని అదే ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. వెంటనే సెల్ఫీ వీడియోలు తీసుకుని నన్ను చంపేస్తున్నారంటూ నేను గదిలోకి వెళ్లి దాక్కున్నానని, నన్ను రక్షించండి అంటూ డయల్​ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్న అనంతరం వారి సమక్షంలో ఆ గది నుంచి బయటికి వచ్చాడు. దీంతో పోలీసులు సోహైల్​ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన ఆడియోలు, సెల్ఫీ వీడియోలు వైరల్​గా మారాయి. ఆమె తండ్రి ఓ బీఆర్​ ఎస్​ నాయకుడని మా పై కావలసుకుని కుట్రతో కేసులు పెడుతున్నాడని, సోహైల్​ సోదరి ఆరోపించింది. ఈ కేసును బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story